Telangana Corona Cases : తెలంగాణలో గత 24 గంటల్లో 50,520 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 614 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,84,062కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 4,107కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,387 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,908 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి : దేశంలో 35వేల దిగువకు కరోనా కొత్త కేసులు.. భారీగా తగ్గిన మరణాలు