ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 67,716 పరీక్షలు నిర్వహించగా.. 1,501 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,98,603 మంది వైరస్ బారినపడినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ బారిన పడి 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,696కి చేరింది.
24 గంటల వ్యవధిలో 1,697 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19 లక్షల 69వేల 169కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 15,738 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2కోట్ల 59లక్షల 3వేల 366 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
మహమ్మారి కారణంగా.. కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. విశాఖపట్నంలో ఒకరు మృత్యువాత పడ్డారు.
ఇదీ చదవండి: గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఆరోపణలు అవాస్తవం: పోలీసులు