ETV Bharat / city

AP Corona: ఏపీలో కొత్తగా 909 కేసులు..13 మరణాలు - andhrapradhesh corona cases updates

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 909 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,543 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 17,218 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

AP Corona: ఏపీలో కొత్తగా 909 కేసులు..13 మరణాలు

author img

By

Published : Aug 16, 2021, 6:35 PM IST

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,962 నమూనాలను పరీక్షించగా 909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,94,606కి చేరింది. తాజాగా 13 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,660కి పెరిగింది. మరోవైపు 1,543 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 17,218 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,57,08,411 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరులో ముగ్గురు, గుంటూరు, కృష్ణ, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:

Ramya Murder case : "ఇన్​స్టా' పరిచయమే ప్రాణం తీసింది.. ప్రజలు అడ్డుకుంటే బతికేదేమో"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.