ETV Bharat / city

రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం - cooperative elections hangama in state

రాష్ట్రంలో సహకార ఎన్నికల వేడి నెలకొంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలపై కన్నేసిన రాజకీయ పార్టీలు తమ సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నాయి. ప్రచార, వ్యూహారచనలో నేతలు నిమగ్నమయ్యారు. నామపత్రాల గడువు శనివారంతో ముగిసినందున... అధికారులు ఇవాళ పరిశీలించనున్నారు. రేపు ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ఉంటుంది.

రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం
రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం
author img

By

Published : Feb 9, 2020, 7:40 AM IST

Updated : Feb 9, 2020, 11:49 AM IST

రాష్ట్రంలో మున్సిపల్ మున్సిపల్ ఎన్నికల వేడి తగ్గకముందే... సహకార ఎన్నికల సందడి మొదలైంది. 905 సంఘాల్లోని 12,100 డైరెక్టర్ పదవులకు నామపత్రాల సమర్పణ గడువు ముగిసింది. చివరి రోజున అభ్యర్థులు పెద్ద ఎత్తున్న నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఓటరు జాబితాలు విడుదల చేసిన అధికారులు.. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వివిధ కారణాలతో ఓటరు జాబితా నుంచి తొలగించిన రైతుల పేర్లు, ఓటరు జాబితాను ఆయా సంఘాల నోటీసు బోర్డులో... సహకారశాఖ ఎన్నికల అథారిటీ ప్రదర్శించింది.

ఎన్నికల నిర్వహణపై సమీక్ష..

ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా సహకార అధికారులతో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి, సహకారశాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య సమీక్షించారు. ఒక్కో పరపతి సంఘంలో... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్‌ ప్రకారం డైరెక్టర్ పదవులు కేటాయించారు. ఛైర్మన్‌ పదవికి మాత్రం రిజర్వేషన్ వర్తించదని సహకార శాఖ స్పష్టం చేసింది. ఎన్నికలు పూర్తిగా రాజకీయాలకు అతీతంగా జరగాల్సి ఉన్నా... రాజకీయ పార్టీల జోక్యం పెరిగింది.

సహకార శాఖ నియమావళి ప్రకారం... అభ్యర్థి రెండు సెట్లకు మించి నామపత్రాలు దాఖలు చేయరాదు. ఒక వార్డులో నమోదైన వ్యక్తి మరో వార్డు నుంచి పోటీ చేయవచ్చు. కాకాపోతే... ప్రతిపాదించే, బలపరిచే వ్యక్తులు మాత్రం అదే వార్డులో విధిగా ఓటుహక్కు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుందని సహకార వర్గాలు తెలిపారు. నామపత్రాలు సమర్పించేప్పుడు... అభ్యర్థితో పాటే ప్రతిపాదించే, బలపరిచే వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలి.

సమానం వస్తే లాటరీ..

నామపత్రాల సమర్పణ గడువు ముగిసినందున... ఇవాళ పరిశీలన ఉంటుంది. రేపు ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు ఉంటుంది. 12,100 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... ఒక్కో కేంద్రంలో ముగ్గురు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. వెంటనే లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. ఛైర్మన్‌ ఎన్నిక పరోక్ష పద్ధితిలోనే కొనసాగుతోందని సహకారశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం

ఇదీ చూడండి: ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతర

File : TG_Hyd_51_07_Cooperative_Elections_Pkg_3053262 From : Raghu Vardhan ( ) సహకార ఎన్నికల ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర సంఘాలకు సంబంధించి ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇతర సహకార సంఘాల నుంచి ఐదుగురు డైరెక్టర్లను డీసీసీబీ, డీసీఎంఎస్ లకు ఎన్నుకుంటారు. గొర్రెలు, మత్య్స, చేనేత, ఉద్యోగ సహకార సంఘాల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది తేలాల్సి ఉంది. ఇప్పుడు ఉన్న పాలకమండళ్లకే పొడిగింపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి...లుక్ వాయిస్ ఓవర్ - రాష్ట్రంలో సహకార ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 905 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలు గడవు రేపటితో ముగియనుండగా... ఈ నెల 15వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఆఫీసు బేరర్ల ఎన్నికకు మూడు రోజల గడువు ఇచ్చారు. అయితే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు - డీసీసీబీకి డైరెక్టర్లను పీఏసీఎస్ లతో పాటు ఇతర సహకార సంఘాల నుంచి కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. పీఏసీఎస్ ల నుంచి ఏగ్రూప్ లో 13 మంది డైరెక్టర్లను ఎన్నుకోనుండగా... ఇతర సహకార సంఘాల నుంచి బీగ్రూప్ లో మరో ఐదుగురు డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. గొర్రెలు, మత్స్య, చేనేత, ఉద్యోగ సహకార సంఘాలు ఇందులో ఉంటాయి. ఆయా సొసైటీల పాలకమండళ్లు ఓటర్లుగా బీ గ్రూప్ డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. డీసీసీబీలతో పాటు డీసీఎంఎస్ లకు కూడా డెరెక్టర్లను ఈ సంఘాలు ఎన్నుకుంటాయి. పీఏసీఎస్ లకు ఎన్నికలు నిర్వహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం బీ గ్రూప్ డైరెక్టర్ల ఎన్నిక కోసం కూడా ఓటర్ల జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే ఆ పాలకమండళ్లకు ఎన్నికలు జరగలేదు. దీంతో పాటు రాష్ట్రంలో భారీ సంఖ్యలో గొర్రెలసహకార సంఘాలు, మత్య్స సహకార సంఘాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ చేపట్టడంతో కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో బీగ్రూప్ డైరెక్టర్ల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. కొత్త సంఘాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం పాత సహకార సంఘాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవచ్చని అంటున్నారు. పాత సహకార సంఘాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లకే పొడిగింపు ఇచ్చి వారే బీగ్రూప్ డైరెక్టర్లను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీఏసీఎస్ లతో పాటు బీగ్రూప్ డైరెక్టర్ల ఎన్నిక కోసం కూడా ఓటర్ల జాబితాను తయారు చేయాలని... డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ల ఎన్నిక కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా అధికారులను సహకార శాఖ ఇప్పటికే ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ల పదవుల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.
Last Updated : Feb 9, 2020, 11:49 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.