కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 19న ఛలో నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రంలో గోడపత్రిక ఆవిష్కరించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి విస్మరించారని ఆరోపించారు. పీఆర్సీ అమలు చేయబోమని మంత్రితో ప్రకటన చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విజయవంతం చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: కరోనా దెబ్బకు 'పద్మ' పురస్కార వేడుక వాయిదా