ETV Bharat / city

డాక్యుమెంట్లు పోగొట్టిన బ్యాంకుకు రూ.5 లక్షల జరిమానా - బ్యాంకు డాక్యుమెంట్లు పోగొట్టిన కేసులో వినియోగదారుల ఫోరం తీర్పు

ఇల్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకు గృహ రుణం మంజూరు చేసింది. అందుకోసం ఒరిజినల్ డాక్యుమెంట్లను తాకట్టు పెట్టుకుంది. వాయిదాలు చెల్లించినప్పటికీ బ్యాంకు అధికారులు ఒరిజినల్ డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వలేదు. బ్యాంకు సిబ్బంది పోగొట్టారని గ్రహించిన బాధితురాలు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఫోరమ్ ఏం తీర్పు ఇచ్చిందో.. ఈ కథనంలో చూద్దాం..

consumer forum judgment on loostng documents  in bank
డాక్యుమెంట్లు పోగిట్టిన బ్యాంకుకు రూ.5 లక్షల జరిమానా
author img

By

Published : Jul 5, 2020, 6:14 PM IST

హైదరాబాద్ పురానాపూల్​కు చెందిన జయశ్రీ జైన్ అప్జల్​గంజ్​ సిండికేట్ బ్యాంకు నుంచి 2005లో గృహ రుణం తీసుకున్నారు. దాని కోసం తాను కొనుగోలు చేసిన ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు మార్టిగేజ్ చేశారు. క్రమంగా వాయిదాలు చెల్లిస్తూ 2013 సెప్టెంబరు నాటికి పూర్తిచేసింది. రుణం పూర్తిగా చెల్లించినందున తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు. అయితే వివిధ కారణాలు చెబుతూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు దాట వేశారు. ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేనందున... బ్యాంకు చీఫ్ మేనేజర్​కు లీగల్ నోటీసు పంపించారు. అయినప్పటికీ స్పందన రాలేదు. జయశ్రీ జైన్ చివరకు హైదరాబాదులోని మూడో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వాలని, మానసిక ఆందోళన కలిగించినందుకు రూ. 15 లక్షలు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు

ఫిర్యాదుదారుతో పాటు సిండికేట్ బ్యాంక్ వాదనలు విన్న వినియోగదారుల ఫోరం... బ్యాంకు తీరును తీవ్రంగా తప్పు పట్టింది. బ్యాంకు కార్యాలయం మార్చడం వల్ల డాక్యుమెంట్లు పోయినట్టు అధికారుల వాగ్మూలాలను బట్టి తెలుస్తోందని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై బ్యాంకు యాజమాన్యం చర్యలు తీసుకోక పోవడాన్ని తప్పుబట్టింది. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత వినియోగదారుడికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇతర వస్తువులు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంక్​పై ఉందని స్పష్టం చేసింది. డాక్యుమెంట్ల కోసం చాలా వెతికినట్టు సిబ్బంది పేర్కొనడాన్ని బట్టి... బ్యాంకులొనే పోయాయని ఫోరం అభిప్రాయానికి వచ్చింది.

బ్యాంకు ఆధీనంలోనే డాక్యుమెంట్లు పోయాయని నోటరీ రాసివ్వాలని బ్యాంకును ఫోరం ఆదేశించింది. టైటిల్ డీడ్ పోయాయని బ్యాంకు ఖర్చుతో పత్రికలో ప్రచురణ ఇవ్వాలని స్పష్టం చేసింది. టైటిల్ డీడ్ సర్టిఫైడ్ కాపీలకు అవసరమైన ఖర్చును బ్యాంకు భరించాలని ఆదేశించింది. మానసిక ఆందోళన కలిగించినందుకు జయశ్రీ జైన్​కు రూ.5 లక్షలు... జరిమానాగా మరో రూ. 20 వేలు చెల్లించాలని బ్యాంకును స్పష్టం చేసింది. 30 రోజుల్లోగా చెల్లించకపోతే 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.