హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. మొయినాబాద్, ఖమ్మంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల ఘటనలను నిరసిస్తూ... ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
హోంమంత్రి మహమూద్ అలీ ఇంటిని ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే... హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: కొవిడ్, వైద్యశాఖలోని కీలక అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ