కాంగ్రెస్ పార్టీ సారథిగా పగ్గాలు చేపట్టేందుకు... రాహుల్ గాంధీ అంగీకరించడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సమర్థించారు. ప్రజా సమస్యల పరంగా దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని... ప్రధాని మోదీ నియంతృత్వ వైఖరితో ప్రజలు విసిగిపోయారని నేతలు పేర్కొన్నారు. కొవిడ్ వేళ వలస కూలీలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారని... చిన్న, మధ్య తరగతి వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు.... స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఈ పోరాటానికి రాహుల్‌గాంధీ సమర్థమైన నాయకత్వాన్ని అందించగలుగుతారన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని.. కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్‌అలీ, బలరాం నాయక్... మల్లు రవి, పొన్నం ప్రభాకర్... సురేశ్ షట్కర్, సిరిసిల్ల రాజయ్య తదితరులు సోనియాగాంధీకి లేఖ రాశారు.