అయోధ్య రామ మందిర నిర్మాణానికి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య లక్షా నూటాపదహారు రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. రాముడు కొందరి వాడు కాదు... అందరి వాడని... రాముడికి రాజకీయాలు ఆపాదించటం సరికాదన్నారు. తన పింఛన్ నుంచి రాముడి ఆలయానికి విరాళం ప్రకటించారు.
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ద్వారా... ఈ మొత్తాన్ని రామమందిర ట్రస్టుకి పంపిస్తానని పొన్నాల పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరిగిందన్న ఆయన... హరిజనవాడల్లో రామాలయాలను నిర్మించిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు.
ఇదీ చూడండి: సీఎంగా కేటీఆర్ బాధ్యతలపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ