పురపాలక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ కార్యచరణ రూపొందిస్తోంది. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జిల్లా కాంగ్రెస్ కమిటీలకే అప్పగించాలని పీసీసీ నిర్ణయించింది. కమిటీలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు ఇందులో కీలకం కానున్నారు. పురపాలక సంఘాలన్నింటికీ ప్రత్యేకంగా బాధ్యులను నియమించనున్నారు.
లోటు భర్తీపై హస్తం దృష్టి
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరటం వల్ల స్థానికంగా నాయకత్వ సమస్య ఉన్న చోట లోటును భర్తీ చేయటంపై కమిటీలు దృష్టి సారించాయి. ముందుగా ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం చేపట్టనున్నాయి.
ఈనెల 5 నుంచి 10 వరకు పురపాలక సమావేశాలు
ఈనెల 4న జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలను ముగించి 5 నుంచి పదో తేదీలోపు పురపాలక సంఘాల వారీగా సమావేశాలను పూర్తి చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని సమన్వయ కమిటీ పురపాలక ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తుంది.
ఇదీ చూడండి : నాచారం ఐడీఏలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి