రాష్ట్ర రాజకీయాలతోపాటు త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నిలపై చర్చించడానికి హైదరాబాద్ ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి జరిగిన అఖిలపక్ష సమాశంలో చోటు చేసుకున్న అంశాలను మర్రి శశిధర్ రెడ్డి.. పార్టీ ముఖ్యనాయకుల దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థి ఎన్నికపై నాయకులు చర్చించనున్నట్లు సమాచారం.
ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్కం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిల నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్యెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్యెల్సీ జీవన్ రెడ్డిలతోపాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు.