ETV Bharat / city

గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​కు కాంగ్రెస్ నేతల లేఖ

author img

By

Published : Oct 4, 2020, 5:35 PM IST

Updated : Oct 4, 2020, 5:45 PM IST

గవర్నర్​ను కలిసేందుకు రాజ్​భవన్​లోకి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు లేఖ రాశారు. రైతుల పక్షాన పోరాడుతూ... వ్యవసాయ చట్టాలపై వినతిపత్రం సమర్పించేందుకు అనుమతించకపోవడమే కాకుండా... అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.

congress leaders wrote letter to governor thamili sai soundara rajan
గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​కు కాంగ్రెస్ నేతల లేఖ

కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నందున గవర్నర్‌ తనను నేరుగా కలిసేందుకు వీల్లేదని చెప్పడాన్ని కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసినట్టు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ ముఖ్యనాయకులు వినతిపత్రం ఇచ్చేందుకు గత నెల 28న అనుమతి కోరితే నిరాకరించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితోపాటు మరో ఇద్దరుముగ్గురికైనా అనుమతి ఇవ్వాలని కోరినా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చివరకు రాజ్‌భవన్‌ గేటు వద్దకు గవర్నర్‌ తమ ప్రతినిధిని పంపినా... వినతి పత్రం ఇస్తామని చెప్పినా... అంగీకరించలేదని విమర్శించారు. అంతేకాకుండా తమ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్‌ వాళ్లది రాజకీయ డ్రామా అని గవర్నర్‌ ఎద్దేవా చేయడం సరికాదన్నారు. గవర్నర్‌ భర్తకు ద్రోణాచార్య అవార్డు రావడంపై అభినందనలు తెలియచేసిన కాంగ్రెస్‌ నేతలు... సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి సౌందరరాజన్​కు సన్మానం చేసి ఫొటోలు దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి అనుమతించినప్పుడు కరోనా నిబంధనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి మహేశ్‌గౌడ్‌, పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ రాహుల్​ పోరుబాట

Last Updated : Oct 4, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.