ETV Bharat / city

'దేశానికి రాహుల్​ను ప్రధానిని చేసినప్పుడే వైఎస్సార్​ ఆత్మకు శాంతి..' - వైఎస్సార్​ 73వ జయంతి వేడుకలు

YSR Birth Anniversary Celebrations: వైఎస్సార్​ 73వ జయంతి వేడుకలను కాంగ్రెస్​ నేతలు ఘనంగా నిర్వహించారు. గాంధీభవన్​లో వైఎస్సార్​ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు.. అనంతరం పంజాగుట్టలో ఉన్న ఆయన విగ్రహానికి పెద్దఎత్తున నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు వైఎస్సార్​ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.

Congress leaders celebrated YSR Birth Anniversary in a grand way in hyderabad

author img

By

Published : Jul 8, 2022, 12:28 PM IST

YSR Birth Anniversary Celebrations: వైఎస్సార్​ అమరుడైనా వారి పేరు మాత్రం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తెలిపారు. దేశానికి రాహుల్​గాంధీని ప్రధానిని చేసినప్పుడే.. వైఎస్సార్​ ఆత్మకు శాంతి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్సార్​ 73వ జయంతి సందర్భంగా.. గాంధీభవన్​లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్​ నేతలు నివాళులర్పించారు. అనంతరం.. పంజాగుట్టలోని వైఎస్సార్​ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో.. రేవంత్​తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజ్, కేవీపీ, పొన్నాల, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, కుసుమకుమార్ పాల్గొన్నారు.

గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్​ విశ్వాసపాత్రుడని రేవంత్​రెడ్డి తెలిపారు. రాహుల్​ను ప్రధాని చేయటమే తన లక్ష్యమన్న వైఎస్సార్..​ చివరి కోరిక నెరవేరకుండానే దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్సార్ ఆలోచనలు కొనసాగించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వైఎస్సార్​కు హైదరబాద్​లో స్మృతివనం లేకపోవడం అవమానకరమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైస్సార్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు. వైస్సార్ స్ఫూర్తితో పని చేసి కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొద్దామని రేవంత్​ సూచించారు.

"సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ని ఆరోజు దేశంలోనే నెంబర్ వన్​గా నిలబెట్టిన నాయకుడు వైఎస్సార్. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడుగా ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు. కాంగ్రెస్ పార్టీపై అటు మోదీ ఇటు కేసీఆర్ కుట్రలు తిప్పికొట్టడానికి వైస్సార్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంటు, ఫీజు రియంబర్స్​మెంట్​, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ మెట్రో రైలు, జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు.. ఇవన్ని వైఎస్సార్​ ఇచ్చిన వరాలే. వైఎస్సార్​ అమరుడైనా వారి పేరు మాత్రం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. వైస్సార్ స్ఫూర్తితో పని చేసి కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొద్దాం."- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

"నాయకుడన్నా.. పాలకుడన్నా.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెబుతారు. వైఎస్సార్​ నిరంతరం ప్రజల కోసమే పని చేశారు. సంక్షేమంతో పాటు దేశానికి అభివృద్ధిని చూపిన మహనీయుడు. హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందుతుందన్నా.. వ్యవసాయం అభివృద్ధి అయ్యిందన్న వైఎస్సార్​ చేసిన జలయజ్ఞం వల్లనే. నిరుద్యోగ యువతి యువకుల కోసం అనేక ఉద్యోగ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన లేని లోటు మనందరికీ బాధాకరం. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సమసమాజ స్థాపన కోసం. రాష్ట్రంలో ఇప్పటికీ అమలవుతోన్న రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్​మెంట్​ ఆయన చొరవే. ఆయన ఆచరణ మా అందరికి ఆదర్శం. ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.