కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల పిల్లలకు సర్కారే బాధ్యత వహించి.. ఉచిత విద్యనందించాలని కోరారు.
రైతుల సమస్యలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర సర్కార్ సమర్థించడం సరైంది కాదని అన్నారు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పిన సీఎం.. ఇప్పుడు ఆ చట్టాలనే సమర్థించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రైతు సమస్యలు, కరోనా బాధితుల గోడుపై సీఎం కేసీఆర్కు వినతి పత్రం అందజేయడానికి వీహెచ్ ప్రగతి భవన్ వెళ్లారు. పోలీసులు అనుమతించకపోవడం వల్ల సెక్యూరిటీ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేసి వెళ్లిపోయారు.