రైతులకు మేలు చేయాలనుకుంటే అందరితో సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైన చట్టాలను తీసుకువస్తే స్వాగతించేవారమని... కాంగ్రెస్ నేత మర్రి శశధర్ రెడ్డి అన్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా ఒకరోజు దీక్ష చేసిన మాజీ ఎంపీ వీ హనుమంతరావుకు, మల్లు రవితో కలిసి సంఘీభావం తెలిపి... నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
భాజపా అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అయినప్పటికీ... ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపా, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ పెడతామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కేసీఆర్ దిల్లీ వెళ్లి రాజీ పడ్డారని విమర్శించారు.