Rahul Gandhi Jodo Yatra: రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా డి.హిరేహాల్ సరిహద్దుకు రాహుల్ యాత్ర చేరుకుంది. ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, రఘువీరారెడ్డిలు.. రాహుల్‌గాంధీకి స్వాగతం పలికారు. డి.హిరేహాల్లోని మారెమ్మ గుడి వద్ద రాహుల్‌గాంధీ విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఓబుళాపురం మీదుగా బళ్లారి బయల్దేరారు.
ఇవాళ దాదాపు 12 కి.మీ. మేర రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. శైలజానాథ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా రాహుల్‌గాంధీ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: