Ponnala Comments: రేపు దిల్లీలో తెరాస చేయబోతున్న దీక్షను కాంగ్రెస్ ఖండిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. దీక్ష పేరుతో ధాన్యం కొనుగోళ్లను మరింత జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న కాలయాపనతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా మిల్లర్లకు రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారని వివరించారు. దిల్లీలో తెరాస చేయబోయే దీక్షను దోపిడీ దీక్షగా అభివర్ణించారు.
"రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటా అని సీఎం కేసీఆర్ మాటిచ్చాడు కదా..? ఇప్పుడేమో వడ్లు కొనటం గురించి పక్కన పెట్టి బియ్యం పంచాయితీ మొదలు పెట్టిర్రు. ఉప్పుడు బియ్యం, ముడి బియ్యం అంటూ.. రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇవన్నీ రైతులకు ఏం సంబంధం. వాళ్లు పండించిన ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనాల్సిందే. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. రైతులను ఆగం చేస్తున్నారు. నిరసన దీక్షలంటూ.. కాలయాపన చేయటం వల్ల రైతులు తమ ధాన్యాన్ని అడ్డికి పావుశేరు లెక్కన అమ్మేసుకుంటున్నారు." - పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చూడండి: