సచివాలయం కూల్చివేతను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి... ఓ ఉన్మాద చర్యగా అభివర్ణించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున... సెక్రెటరియేట్ను కూల్చకుండా, కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. అయినప్పటికీ సచివాలయం కూల్చేందుకు ప్రక్రియ ప్రారంభించటం ముఖ్యమంత్రికి శ్రేయస్కరం కాదన్నారు.
భవిష్యత్లో వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నందున... ఆసుపత్రులు సరిపోవని నాగం ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో మైదానాలను ఆసుపత్రులుగా మారుస్తుంటే... అన్ని వసతులున్న సచివాలయాన్ని కూల్చడం బాధాకరమన్నారు. ఆసుపత్రిగా మార్చి, ఓ ఆర్నెళ్లు కూల్చకుండా ఆపాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు