Addanki Dayakar apologies to Komatireddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పార్టీ తుంగతుర్తి నేత అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పారు. నిన్న చండూరు బహిరంగసభలో వెంకట్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. దయాకర్ క్షమాపణలు చెప్పారు. సమావేశంలో ఏదో ఆవేశంలో నోరుజారానని.. ఎంపీకి వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్లు అద్దంకి వివరించారు. తన వాఖ్యల వల్ల బాధ పడుతున్న కోమటిరెడ్డి అభిమానులు క్షమించాలన్న అద్దంకి.. పార్టీకి నష్టం చేయాలని భావించలేదన్నారు. వివరణ ఇచ్చేలోపే నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారన్న అద్దంకి.. మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.
"కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నా. సభలో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో తప్పు దొర్లింది. ఎంపీ వెంకట్‌రెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణ చెప్తున్నా. కొందరు అసంతృప్తిగా ఉండటంతో నా వాఖ్యలపై పునరాలోచించా. నా వాఖ్యల వల్ల బాధ పడుతున్న కోమటిరెడ్డి అభిమానులు క్షమించాలి. పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ భావించలేదు. షోకాజ్ నోటీసులు రాకముందే వివరణ ఇవ్వాలనుకున్నా. వివరణ ఇచ్చేలోపే నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నా వల్ల మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటా." - అద్దంకి దయాకర్, కాంగ్రెస్ నేత
అంతకుముందు పీసీసీ క్రమశిక్షణ కమిటీ అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి స్వయంగా సమావేశంలో ఉండడంతో అయనే సాక్షిగా నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎంపీ కోమటిరెడ్డి అనుచరులు నల్గొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో ఆందోళన చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దయాకర్ క్షమాపణలు చెప్పాలని.. డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: