మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వుడ్ సీట్లలోనే కాకుండా జనరల్ సీట్లలో కూడా బీసీలకు కొన్ని కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించాలని కోరారు. క్షేత్రస్థాయిలో డీసీసీలు బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బీసీలలో రాజకీయ చైతన్యం పెరిగిందని..భాజపా, తెరాస లోపాయికారి రాజకీయాలపై ప్రజలకు అవగాహన ఉందని స్పష్టం చేశారు. తెరాస, కాంగ్రెస్ ఒక్కటేనని భాజపా అసత్యప్రచారం మానుకోవాలని హితవు పలికారు.