ETV Bharat / city

జేఈఈ మెయిన్​ నిర్వహణ తేదీల్లో గందరగోళం... - jee main exam schedule

దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్​ విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్​ మొదటి విడత పరీక్ష ఫిబ్రవరి నాలుగో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్ష నోటిఫికేషన్​కు సంబంధించి మంగళవారం సాయంత్రం సమాచార కరపత్రాన్ని ఎన్​నీఏ వెబ్​సైట్లో ఉచ్చి.... రాత్రి వరకు తొలగించటం చర్చనీయాంశంగా మారింది.

confusion in jee main exam dates
confusion in jee main exam dates
author img

By

Published : Dec 16, 2020, 3:53 AM IST

జేఈఈ మెయిన్ నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థ.. ఎన్​టీఏ ఆరంభంలోనే గందరగోళం సృష్టించింది. హడావిడిగా షెడ్యూలు ప్రకటించి.. మళ్లీ వెనక్కి తీసుకుంది. మొదటి విడత జేఈఈ మెయిన్ షెడ్యూలుపై మంగళవారం సాయంత్రం సమాచార బులెటిన్​ను వెబ్​సైట్​లో ఎన్​టీఏ అప్​లోడ్​ చేసింది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు మొదటి విడత పరీక్ష ఉంటుందని.. మంగళవారం నుంచే ఆన్​లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు బులిటెన్​లో వెల్లడించింది.

ఆ బులిటెన్​ను రాత్రి వరకు వెబ్​సైట్ నుంచి ఎన్​టీఏ తొలగించింది. దీన్నిబట్టి చూస్తే... షెడ్యూలులో కొన్ని మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. పరీక్ష తేదీల్లో కొంత గందరగోళం ఏర్పడినప్పటీకీ.. జేఈఈ మెయిన్ నాలుగు సార్లు నిర్వహించనున్నట్టు మాత్రం ఎన్​టీఏ స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మార్చిలో జేఈఈ మెయిన్ నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయించింది.

ఇదీ చూడండి: విద్యాసంస్థలను త్వరలోనే పునఃప్రారంభిస్తాం: సబితా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.