ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొఠియా వివాదస్పద గ్రామాల్లో ఒకటైన పగులుచెన్నూరులో.. ఏపీ, ఒడిశా రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకేసారి పర్యటించడం వివాదంగా మారింది. చెన్నూరు, పట్టుచెన్నూరు ప్రజలు.. రాబోయే ఒడిశా ఎన్నికలను బహిష్కరించేందుకు నిర్ణయించారు. ఈ విషయంపై.. ఆ గ్రామస్థుల సమావేశానికి.. పార్వతీపురం ఐటీడీవో పీవో కూర్మనాథ్ హాజరయ్యారు. అదే సమయంలో.. ఒడిశా నుంచి పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతం పాండే అక్కడికి వచ్చారు.
ఒడిశా ప్రాంతంలోకి ఎందుకు వస్తున్నారంటూ..ఐటీడీవో పీవోను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇది ఒడిశా భూభాగం కాదని.. వివాద ప్రాంతమని ఆంధ్రా అధికారి సమాధానమిచ్చారు. ఎన్నికలు బహిష్కరిస్తామని స్థానికులు చెబుతుంటే.. సమావేశానికి ఎందుకు వచ్చారని.. ఎమ్మెల్యే మరోసారి ప్రశ్నించారు. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ ఎమ్మెల్యేతో పాటు అనుచర వర్గం నినాదాలు చేశారు. దీంతో పీవో అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి: ఆస్పత్రి ప్రారంభోత్సవంలో రసాభాస.. వెనుదిరిగిన కిషన్‌రెడ్డి, తలసాని