Thirumala Protest: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారదర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు ఆలయంలో ఆందోళనకు దిగారు. క్యూలైన్లలో తాము గంటల తరబడి వేచి ఉన్నామని.. సర్వదర్శనానికి వచ్చిన భక్తులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం పిల్లలకు పాలు, పెద్దలకు అల్పాహారం ఇవ్వకుండా ఐదారు గంటలు క్యూలైన్లలో నిలబెట్టి, షెడ్లలో కూర్చొబెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. తీవ్ర అసహనానికి గురై శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈవో, అదనపు ఈవో వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా తితిదే భద్రతా సిబ్బంది, భక్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. క్యూలైన్లలో గంటలపాటు వేచి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని భక్తులు మండిపడ్డారు. రంగంలోకి దిగిన అధికారులు భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సమీపంలోకి మీడియాను సైతం అనుమతించలేదు.
ఇదీచదవండి: