పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్, మహబూబ్నగర్ పోలీసులపై పలువురు బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లాలో మంత్రి అండదండలతో భూకబ్జాలు చేస్తున్నారని ప్రశ్నించినందుకు.. తమపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
మహబూబ్నగర్ డీఎస్పీ, సీఐ, ఎస్సై.. మంత్రి ఆదేశాల మేరకు బీసీలైన తమపై కేసులు పెడుతూ జైళుకు పంపిస్తున్నారని బాధితులు కృష్ణ ముదిరాజ్, గోనెల శ్రీనివాస్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసును స్వీకరించిన హెచ్చార్సీ.. మార్చ్ 15లోపు ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: అమ్ములును ఎత్తుకెళ్లిందెవరు? ఏం చేశారు?