ETV Bharat / city

Kodi pandalu: జోరుగా కోడి పందేలు.. చేతులు మారిన కోట్ల రూపాయలు

Kodi pandalu: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రాలో కోడిపందేల సందడి నెలకొంది. కృష్ణా, ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల్లో కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందేల కోలాహలం మొదలైంది. కొన్నిచోట్ల బరులు సిద్ధం కాగా.. మరికొన్ని చోట్ల పందెంరాయుళ్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే కోట్ల రూపాయలు చేతులు మారాయి.

kodi pandalu
ఆంధ్రాలో కోడి పందేలు
author img

By

Published : Jan 15, 2022, 10:24 AM IST

జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

Sankranti celebrations: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గ వ్యాప్తంగా కోడి పందేలు, పేకాట శిబిరాలను రాజకీయ పార్టీ నాయకులు యథేచ్ఛగా నిర్వహించారు. వీటితో పాటు గుండాట, నెంబర్ల ఆటలు సాగాయి. జగ్గయ్యపేట ప్రాంతంలో కోడి పందేలు జోరుగా నిర్వహించారు. చిల్లకల్లు, షేర్ మహ్మద్ పేట, తొర్రగుంట పాలెం, సత్యనారాయణపురం ప్రాంతాల్లో కత్తి కట్టి కోళ్లను పందెంలోకి దింపారు. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లో కోడిపందేలు, మూడు ముక్కలాట, గుండాటలతో బరుల వద్ద సందడి నెలకొంది. కోడి పందేలను చూసేందుకు చిన్నారులూ తరలివచ్చారు.

భారీ ఏర్పాట్లు

Kodi pandalu: కోడి పందేల బరులు కృష్ణా జిల్లా చందర్లపాడులో 2 చోట్ల, నందిగామలో 2 చోట్ల, కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద 2 ప్రాంతాల్లో, పరిటాలలో ఒక చోట ఏర్పాటు చేశారు. కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి మరి బరిలోకి దింపారు. మూడు ముక్కలాట, గుండాటలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కూచిపూడిలో బరుల వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. బరుల వద్ద నెలకొన్న రద్దీతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తోట్లవల్లూరు మండలంలో పందేలు ఊపందుకున్నాయి. అంపాపురంలో జోరుగా పందేలు నిర్వహించారు.

పోలీసుల దాడులు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం తమ్మడపల్లి గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 మందిని అదుపులోకి తీసుకుని 18 వేల నగదు, 3 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. చాలా చోట్ల పోలీసులు చేసిన హెచ్చరికలు కేవలం ప్రకటనలకే పరిమితం కాగా, శిబిరాల్లో కోట్లాది రూపాయలు నగదు చేతులు మారాయి. శిబిరాలు తొలగింపు పేరుతో అధికారులు హడావిడి చేశారని... పోటీలు ప్రారంభం అయ్యాక మాత్రం కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో జోరెత్తిన కోడి పందేలు

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో శుక్రవారం భోగి రోజు పెద్దఎత్తున కోడి పందేలు ప్రారంభమయ్యాయి. వీటిలో పాల్గొనడానికి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. తొలి రోజు రెండు జిల్లాలో దాదాపు 420కు పైగా బరుల్లో పందేలు జరిగాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిరోజు 12 వేలకుపైగా కోడిపుంజులు మృత్యువాతపడగా.. పందేల్లో రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు చేతులు మారి ఉంటాయని సమాచారం. ఇది కాకుండా 300 వరకు గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ సుమారు మరో రూ.50 కోట్ల వరకు పందేలు కాసినట్లు అంచనా.

ప్రముఖుల నేతృత్వంలో

ప్రధానంగా కోనసీమలోని కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో అన్ని హంగులతో 10కి పైగా బరులు ఏర్పాటు చేశారు. పెద్ద బరిలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మధ్య పోటీగా రోజుకు 20 కోడి పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటికి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖులు నేతృత్వం వహిస్తున్నట్లు తెలిసింది. పందెం గెలిచిన వారికి వెండి నాణెం బహుమతిగా ఇస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే 60 కోడి పందేల్లో ఏ జిల్లా ఎక్కువగా గెలుస్తుందో వారికి ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. కేవలం పెద్ద బరిలో ఒక్కో పందెం రూ.50 లక్షలకుపైగా నడుస్తోంది. పల్లంకుర్రులో అధికార పార్టీకి చెందిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కోడి పందేలను తిలకించారు.

...

ఫోన్లు.. డ్రోన్లు.. ఎల్‌ఈడీ తెరలు

పశ్చిమగోదావరి జిల్లాలో వర్షం పడుతుండటంతో బరులు, పందెం రాయుళ్ల కోసం నిర్వాహకులు రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు వేశారు. భీమవరం, సీసలి వంటి ప్రాంతాల్లో డిజిటల్‌ తెరలు ఏర్పాట్లు చేశారు. ఈసారి పందేలలో సెల్‌ఫోన్లు కీలక పాత్ర పోషించాయి. విశాలమైన బరులు ఏర్పాటు చేసిన చోట.. డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తూ వాటిని సెల్‌ఫోన్లలో షేర్‌ చేసుకొని ఎక్కడివారక్కడే పందేలు వేసుకున్నారు. పందెం డబ్బులు పేటీఎంల ద్వారా చెల్లించుకున్నారు. అలంపురం, దువ్వ, తేతలి ప్రాంతాలలో కోజా(పందెలో ఓడిన కోడి) ధర రూ.6 వేల వరకు పలికింది. కోడి పందేలు చూసేందుకు, ఆడేందుకు వచ్చిన వారితో తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని లాడ్జీలు నిండిపోయాయి. సాధారణంగా రూ.1200 ఉండే గది అద్దె రూ. 2 నుంచి 3 వేలు పలికాయి. కొన్నిచోట్ల అపార్ట్‌మెంట్లలో అతిథులకు ఆశ్రయం కల్పించారు. రాత్రిళ్లు కూడా జూదం నిర్వహించేందుకు వీలుగా బరుల వద్ద ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరిలో ఓ కోడి బరి నుంచి జనాల్లోకి దూకడంతో దాని కాలికున్న కత్తి వల్ల ఒకరు గాయపడ్డారు.

...
....

ఇదీ చదవండి: Animal Beauty Contests: మీకే కాదు మాక్కూడా జరిగాయి అందాల పోటీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.