ETV Bharat / city

నేడు కోస్ట్‌గార్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం

భారత కోస్ట్ గార్డ్ 45వ వ్యవస్థాపక దినం జరుపుకుంది. 1978లో కేవలం ఏడు నౌకలతో అతికొద్ది వనరులతో ఏర్పాటైన ఈ దళం ఇప్పుడు ఏకంగా 156 నౌకలు, 62 విమానాలు సమకూర్చుకుని ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కోస్ట్ గార్డ్​గా ఎదిగింది. 2025 నాటికి 200కి పైగా నౌకలు, 80 విమానాలతో మరింత విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించింది.

నేడు కోస్ట్‌గార్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం
నేడు కోస్ట్‌గార్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం
author img

By

Published : Feb 1, 2021, 10:10 PM IST

నేడు కోస్ట్‌గార్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం

తీరప్రాంత రక్షణే లక్ష్యంగా... 1978లో ఏర్పాటైన కోస్ట్‌గార్డు... అందుకు తగ్గట్లే సముద్రంలో భారత ప్రయోజనాలను సమర్థంగా కాపాడుతోంది. కడలిలో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు నిలపటంలో కీలకపాత్ర పోషిస్తోంది. పరిమిత వనరులతో ఏర్పాటైన ఈ సంస్థ... ఇప్పుడు ఏకంగా 156 నౌకలు, 62 విమానాలు సమకూర్చుకుంది. 2025 నాటికి 200కి పైగా నౌకలు, 80 విమానాలతో మరింత విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించింది. వాణిజ్య నౌకల రక్షణ, ప్రమాదాల్లో సాయం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 10 వేలకుపైగా ప్రాణాలు కాపాడటంతో సాయపడింది. విపత్కర పరిస్థితుల్లో... 14 వేలమందికిపైగా ప్రాణాలను నేరుగా కాపాడింది. కొవిడ్‌ విజృంభించిన సమయంలోనూ రోజుకు 50 నౌకలు 12 విమానాలను, సముద్ర జలాలపై ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో కాపలాగా విధులు నిర్వర్తించింది. ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌లో... 10 విదేశీ బోట్లతో చేపల వేట సాగించే అక్రమాలకు చెక్‌పెట్టింది. దాదాపు 1500 కోట్ల రూపాయల సంపద కాపాడింది.

ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది

ముందస్తు సన్నద్ధత, అవసరం మేరకు స్పందన అన్న లక్ష్యంగా... గతేడాది హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో 11 తుపాన్లు వచ్చినప్పుడు... 6 వేల చేపల పడవల్లో 40 వేల మందిని సురక్షితంగా రేవులకు చేర్చింది. 333 మీటర్ల పొడవైన నౌకలో చమురు రవాణా జరుగుతుండగా సంభవించిన భీకర అగ్నిప్రమాదంలో సాహోసపేతంగా రక్షణ చర్యలు చేపట్టింది. ప్రాణాలు నిలపటమేగాక... కాలుష్య విస్తరణను నిరోధించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.

నిరంతర గస్తీ

సారెక్స్ పేరిట పౌర రక్షణ విభాగాలతో కలిసి పనిచేస్తూ... తీరంలో, సముద్రంపైనా దేశ ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా నిరంతర గస్తీ నిర్వహిస్తూ భారత సార్వభౌమత్వాన్ని కాపాడుతోంది.

ఇదీ చదవండి: 'రాష్ట్రానికి నిధులు తగ్గించాలని సూచించినా... తగ్గించలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.