ETV Bharat / city

'జిల్లాకో విమానాశ్రయం ఉండాలనేది మన లక్ష్యం కావాలి' - సీఎం వార్తలు

CM Jagan Review on Ports And Airports: ఏపీలో పోర్టులు, విమానాశ్రయాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాకో విమానాశ్రయం ఉండాలనేది మంచి ఉద్దేశమన్న ఆయన.. వీటిని ఏకరీతిలో నిర్మించాలని సూచించారు. రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి చేయాలని ఆదేశించారు. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలు వేగంగా పూర్తికావాలని స్పష్టం చేశారు.

CM Jagan Review on Ports And Airports
విమానాశ్రయాల విస్తరణపై సీఎం జగన్‌ సమీక్ష
author img

By

Published : Jan 20, 2022, 5:04 PM IST

Updated : Jan 20, 2022, 8:06 PM IST

CM Jagan Review on Ports And Airports: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాలు నిర్మించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాకో విమానాశ్రయం ఉండాలనేది మంచి ఉద్దేశమన్నారు. ఇందులో అన్ని రకాల మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. బోయింగ్‌ విమానాలూ దిగేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సూచించారు. పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్షించిన సీఎం.. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి గౌతమ్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిర్ణీత వ్యవధిలోగా

రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణతో పాటు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న ఆయన.. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలు వేగంగా పూర్తికావాలని స్పష్టం చేశారు. నిర్వహణలోని విమానాశ్రయాల పనులు ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని.. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. నిర్ణీత వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని.. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ప్రాధాన్యతా క్రమంలో

"రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి చేయాలి. రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలు వేగంగా పూర్తికావాలి. నిర్ణీత వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై శ్రద్ధ పెట్టాలి. రద్దీకి తగినట్లు సౌకర్యాలు, విస్తరణ పనులు వేగవంతం చేయాలి. 9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను ప్రాధాన్యంగా తీసుకోవాలి. హార్బర్లు, పోర్టులను ప్రాధాన్యంగా తీసుకుని నిర్మించాలి" - సీఎం జగన్, ఏపీ ముఖ్యమంత్రి

రెండో విడతలో 5 హార్బర్లను నిర్ణీత వ్యవధిలో నిర్మిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. 5 ఫిషింగ్‌ హార్బర్లకు త్వరలో టెండర్లు ఖరారు చేస్తామని వివరించారు.

ఇదీ చదవండి: ఖమ్మం జిల్లా తెరాసలో విభేదాలెక్కడివి.. అవన్ని పుకార్లేనన్న పువ్వాడ

Last Updated : Jan 20, 2022, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.