ETV Bharat / city

JAGAN Condolence to Goutham Reddy: గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్​ నివాళి - మంత్రి గౌతమ్‌రెడ్డి వార్తలు

CM JAGAN Condolence to Goutham Reddy: ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల వైకాపా నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.హైదరాబాద్‌లోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్​ అంజలి ఘటించారు. గౌతమ్‌రెడ్డి తండ్రి రాజమోహన్‌రెడ్డితో పాటు ఆయన తల్లి, భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

JAGAN Condolence to Goutham Reddy
JAGAN Condolence to Goutham Reddy
author img

By

Published : Feb 21, 2022, 5:01 PM IST

CM JAGAN Condolence to Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి హఠాన్మరణం పట్ల వైకాపా నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. స్నేహితుడు, సహచర మంత్రిని కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంజలి ఘటించారు. గౌతమ్‌రెడ్డి తండ్రి రాజమోహన్‌రెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్ర ఆవేదనతో ఉన్న కుటుంబసభ్యులను ఓదార్చారు. కుమారుడి మృతితో కుంగిపోయిన గౌతమ్‌రెడ్డి తల్లి.. జగన్‌ను చూడగానే ఆయన చేతులు పట్టుకుని తీవ్రంగా రోదించారు. ఓదార్పుగా గౌతమ్‌రెడ్డి తండ్రి రాజమోహన్‌రెడ్డిని జగన్‌ కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఆయన పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి.. ఘటన వివరాలు తెలుసుకున్నారు. జగన్‌ సతీమణి భారతి.. గౌతమ్‌రెడ్డి భార్యను, తల్లిని ఓదార్చారు.

గౌతమ్‌రెడ్డి అకాలమరణం జీర్ణించుకోలేకపోతున్నాం: సజ్జల

గౌతమ్‌రెడ్డి అకాలమరణం జీర్ణించుకోలేకపోతున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గౌతమ్​రెడ్డికి నివాళి ఘటించిన సజ్జల.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని రేపు ఆయన సొంత జిల్లా నెల్లూరుకు తీసుకెళ్లనున్నారు. రేపంతా నెల్లూరులో ప్రజల సందర్శనార్థం ఉంచి.. ఎల్లుండి ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంత్యక్రియలకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు.

అత్యంత బాధగా ఉంది

గౌతంరెడ్డి హఠాన్మరణంపై మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడిన సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందని బొత్స అన్నారు. గౌతంరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గౌతంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అన్నారు. గౌతమ్‌రెడ్డి మరణం పట్ల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధను కలిగించిందన్నారు. గౌతమ్‌రెడ్డి నిజాయతీ పరుడని.. వివాదాలు లేకుండా పనిచేసిన మంత్రి అని పేర్కొన్నారు.

మంచి మిత్రుడిని కోల్పోయా

గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రులు.. ఆదిమూలపు సురేశ్‌, కొడాలి నాని, ఆళ్లనాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా చిన్న వయసులో మరణించటం బాధాకరమని మంత్రి సురేశ్‌ అన్నారు. మంచి సహచర మిత్రుడిని కోల్పోయానని మంత్రి కొడాలి నాని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం గౌతమ్‌రెడ్డి ఎంతో కృషి చేశారని.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం నిన్నటివరకు దుబాయ్‌లో పర్యటించారని ఆళ్ల నాని అన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి లేకపోవడం.. పార్టీకి, జిల్లాకు తీరని లోటు అని మంత్రి అనిల్‌ అన్నారు. అందరితో నవ్వుతూ, కలివిడిగా ఉండేవారని.. సొంత అన్నయ్యను కోల్పోయినట్లు బాధగా ఉందన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై వైకాపా ఎమ్మెల్యే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మనిషి, సమర్థమైన నేతను కోల్పోవడం పట్ల ఆవేదన వెలిబుచ్చారు. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు.

రెండు రోజులపాటు సంతాప దినాలు

గౌతమ్‌రెడ్డి అకాలమరణంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన మృతికి సంతాపంగా రాష్ట్ర సచివాలయంలో జాతీయపతాకాన్ని అవనతం చేశారు. గౌతమ్‌రెడ్డి ఛాంబర్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ సిబ్బంది గౌరవంగా చూసేవారని, ఆప్యాయంగా పలకరించేవారని వాళ్లు గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.