ETV Bharat / city

భారీ వర్షాల నేపథ్యంలో సీఎండీ ప్రభాకర్‌ రావుతో మాట్లాడిన సీఎం కేసీఆర్ - జెన్​కో సీఎండీ ప్రభాకర్‌ రావుతో మాట్లాడిన సీఎం

భారీ వర్షాల నేపథ్యంలో జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్‌ రావుతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. విద్యుత్‌ శాఖ అప్రమత్తంగా ఉందని సీఎండీ ప్రభాకర్‌ రావు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్​ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని... విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్...​ సీఎండీని ఆదేశించారు.

CM spoke with genco CMD Prabhakar Rao in the wake of heavy rains
భారీ వర్షాల నేపథ్యంలో సీఎండీ ప్రభాకర్‌ రావుతో మాట్లాడిన సీఎం
author img

By

Published : Oct 14, 2020, 9:08 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్​రావు ముఖ్యమంత్రి కేసీఆర్​కు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్... సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జెన్​కో, ట్రాన్స్​కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ విషయంలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సీఎండీని ఆదేశించారు.

చాలా చోట్ల విద్యుత్ శాఖకు భారీ నష్టం జరిగిందని.. విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారని... వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు విద్యుత్ శాఖ ఇదే స్పూర్తి కొనసాగించాలని ముఖ్యమంత్రి సీఎండీని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు.. వరదల్లో పెద్ద సంఖ్యలో ట్రాన్స్​ఫార్మర్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం వల్ల తీగలు తెగిపోయాయని సీఎం కేసీఆర్​కు సీఎండీ ప్రభాకర్ రావు వివరించారు. ఇంకా వానలు, వరదల ఉద్ధృతి తగ్గలేదని తెలిపారు. జలమయమైన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదన్నారు. హైదరాబాద్​తో పాటు చాలా పట్టణాల్లో అపార్టుమెంట్​లు నీటితో నిండి ఉండడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం అనివార్యమైందని సీఎండీ తెలిపారు. కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేయడం జరిగిందని.. పరిస్థితిని బట్టి మళ్లీ సరఫరా పునరుద్దరణ చేస్తామని సీఎండీ సీఎం కేసీఆర్​కు వివరించారు.

ఇవీ చూడండి: 'సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.