ETV Bharat / city

ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఏపీ సీఎం ఆగ్రహం - ప్రతిభా పురస్కారాల పేరు మార్పు న్యూస్

ప్రతిభా పురస్కారాలకు కలాం పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై మండిపడ్డారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు. యథాతధంగా అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని అన్నారు.

cm-serious-on-prathibha-awards-go-issue
author img

By

Published : Nov 5, 2019, 3:31 PM IST

ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై సీఎం ఆగ్రహం

పదో తరగతి ప్రతిభావంతులకు ఏటా ఇచ్చే అబ్దుల్ కలాం పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అబ్దుల్ కలాం పేరిట ఉన్న పురస్కారాన్ని వైఎస్​ఆర్ పేరిట అందించనున్నట్లు నిన్న జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. తనకు తెలియకుండా ప్రతిభా పురస్కారాల పేరు మార్చడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పురస్కారాలకు యథాతధంగా అబ్దుల్ కలాం పేరు పెట్టాలన్నారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, పూలే, జగజ్జీవన్​రాం వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు. అంతకు ముందు తెదేపా అధినేత చంద్రబాబు... అబ్దుల్ కలాం పేరిట ఉన్న ప్రతిభ పురస్కారాల పేరు మార్చడంపై మండిపడ్డారు. ఈ చర్య ఎంతో విస్మయానికి గురిచేసిందన్నారు.

ఇదీ చూడండి:

ఇసుక కొరతతో మరో భవన కార్మికుడు ఆత్మహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.