ETV Bharat / city

ప్రీ పెయిడ్‌ మీటర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు.. - power review

తెలంగాణ విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థిక సహకారంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో అద్భుత పనితీరు ప్రదర్శించి దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. విద్యుత్​శాఖ పనితీరుపై ప్రగతి భవన్​లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రెప్పపాటు కూడా కరెంటుపోవద్ధు: కేసీఆర్​
author img

By

Published : Aug 1, 2019, 5:01 AM IST

Updated : Aug 1, 2019, 7:36 AM IST

రెప్పపాటు కూడా కరెంటుపోవద్ధు: కేసీఆర్​

రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంట్ పోకూడదని, విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దనేది తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ప్రగతి భవన్​లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్​ సంస్థల పనితీరుపైనే రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉన్నందున వాటిని కాపాడుకుంటామని అన్నారు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు ఇకపై ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించేలా కఠినమైన విధానం తీసుకొస్తామని తెలిపారు.

నాడు సంక్షోభం... నేడు ఆదర్శం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాడు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదని... కానీ నేడు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. మెరుగైన విద్యుత్ వల్ల పారిశ్రామికాభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. పెండింగ్ బిల్లులు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ప్రభుత్వం చెల్లింస్తుందని... ఇక నుంచి సకాలంలో చెల్లించకపోతే సర్పంచి, గ్రామ కార్యదర్శి, మున్సిపల్ ఛైర్​పర్సన్, కమిషనర్​పై చర్యలుంటాయని హెచ్చరించారు.

త్వరలో పవర్ వీక్

వీధి లైట్ల వాడకంలోనూ క్రమశిక్షణ రావాలని... పగలు వెలగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చాలన్నారు. ఎత్తిపోతల పథకాలకు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. విద్యుత్ సంస్థల బలోపేతానికి నిధులు సమకూర్చుకోవడానికి అవసరమైతే ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి 60 రోజుల కార్యచరణలో... వంగిన పోళ్లు, ఒరిగిన లైన్లు, పెండింగ్ బిల్లుల వసూళ్లకు పవర్ వీక్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సోలార్​కు ప్రాధాన్యత

వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమయ్యేది, ఎంత బిల్లు వచ్చేది శాస్త్రీయంగా మదింపు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సబ్​స్టేషన్లు, ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటుకు నూతన లే అవుట్లలో స్థలం కేటాయించేలా నిబంధన తీసుకొస్తామన్నారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాలపై నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు సరైన అంచనాలతో ముందుకుపోవాలని సూచించారు. చౌకగా లభించే సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలన్న ముఖ్యమంత్రి... వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్​కు టెండర్లు పిలవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖకు ఎప్పుడు అవసరం ఏర్పడినా తీర్చగలిగే ఆర్థిక విధానం రూపొందించాలని సంబంధిత శాఖను సీఎం కోరారు.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీలో అధికారుల బదిలీలు

sample description
Last Updated : Aug 1, 2019, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.