రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు తెరాస పూర్తి మద్దతు ఇస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దేశంలోని రైతులందరినీ సంఘటితం చేయాల్సి అవసరం ఉందన్నారు. దేశంలోని రైతులందరికీ మంచి నాయకత్వం అవసరం ఉందని... రైతు సంక్షేమ పథకాల్లో సీఎం కేసీఆర్... దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి కూడా సీఎం కేసీఆర్ బాసటగా నిలుస్తారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర విధానాల వల్ల భవిష్యత్‌లో వ్యవసాయరంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంది. రైతులను దెబ్బతీసి, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా కేంద్రం వ్యవహరిస్తోంది. వరికి కేంద్రం ఇచ్చే మద్దతు ధర కంటే ఎక్కువ ఇవ్వాలని సీఎం సిద్ధమయ్యారు. ఎక్కువ చెల్లింపులు చేయకుండా కేంద్రం ఆదేశాలు జారీ చేసి రాష్ట్ర ప్రయత్నాన్ని అడ్డుకుంది.
- నిరంజన్ రెడ్డి
ఇదీ చదవండి : భారత్ బంద్‌కు కేసీఆర్ సంపూర్ణ మద్దతు