ETV Bharat / city

CM KCR meeting on drugs: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం.. నేడు కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం - CM KCR meeting on drugs

రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై కార్యాచరణ రూపొందించేందుకు సంబంధిత అధికారులతో నేడు.. సీఎం కేసీఆర్(CM KCR meeting on drugs issue) సమావేశం కానున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సీఎం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాల పరిధిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ పరిశీలించనున్నారు.

cm-kcr-will-conduct-meeting-on-drugs-issue-in-pagati-bhavan-on-october-20th

author img

By

Published : Oct 20, 2021, 5:52 AM IST

రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను(CM KCR meeting on drugs issue) అరికట్టేందుకు నేడు ప్రగతిభవన్​లో పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో సీఎం కేసీఆర్(CM KCR meeting on drugs issue) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, హోం శాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డీజీపీ మహేందర్ రెడ్డి పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్​ఫోర్స్ అధికారులు తదితరులు హాజరుకానున్నారు.

కఠిన చర్యలు తీసుకునేలా..

తమ జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో జిల్లా ఎక్సైజ్(CM KCR meeting on drugs issue) శాఖాధికారులు రావాలని సీఎం ఆదేశించారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత నిర్వీర్యం కాకూడదనే లక్ష్యంతో సమావేశంలో కార్యాచరణను రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను(CM KCR meeting on drugs issue) ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ సమర్థవంతంగా జరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుందని కేసీఆర్(CM KCR meeting on drugs issue) తెలిపారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్ఠంగా అమలు చేసిందని వివరించారు. ఇటీవల దేశవ్యాప్తంగా పెచ్చురిల్లుతున్న డ్రగ్స్ కల్చర్ కారణంగా రాష్ట్రంలో కఠిన చర్యలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ సమావేశం నిర్వహించనున్నారు.

యథేచ్చగా కేసులు..

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయిని హైదరాబాద్‌ కేంద్రంగా పలు రాష్ట్రాలకు ముఠాలు తరలిస్తున్నాయి (Growing ganja sales in Hyderabad). నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 78 కేసుల్లో 121 మందిని అరెస్టు చేసిన పోలీసులు... 14 వందల కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ తరచూ గంజాయి పట్టివేత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి (Growing ganja sales in Hyderabad). ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా... నిత్యం మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో గంజాయి విక్రయం, సరఫరా పెరగడంతో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించేదుకు సిద్ధమైంది.

ఇదీ చూడండి:

గంజాయికి అడ్డాగా మారుతున్న భాగ్యనగరం.. చర్యలకు ఉపక్రమించిన సర్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.