ETV Bharat / city

వసంత్ విహార్‌లో తెరాస కార్యాలయం సందర్శించిన సీఎం కేసీఆర్

kcr
kcr
author img

By

Published : Oct 12, 2022, 4:33 PM IST

Updated : Oct 12, 2022, 5:02 PM IST

16:28 October 12

వసంత్ విహార్‌లో తెరాస కార్యాలయం సందర్శించిన సీఎం కేసీఆర్

వసంత్ విహార్‌లో తెరాస కార్యాలయం సందర్శించిన సీఎం కేసీఆర్

CM KCR Delhi Tour Updates: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండో రోజు వసంత్‌ విహార్‌లో పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు పర్యవేక్షించారు. 'తెరాస' పేరును 'భారాస'గా మార్చుతూ నిర్ణయం తీసుకుని, దసరా పండుగ నాడు అధికారికంగా ప్రకటించిన తర్వాత తొలిసారి దిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్‌... నిన్న సాయంత్రం 'భారాస' కేంద్ర కార్యాలయ పనులు పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఇవాళ... వసంత్‌ విహార్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్, దామోదరరావు, వద్దిరాజు రవిచంద్రలతో కలిసి పరిశీలించారు. అక్కడ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లను పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుని... పలు సూచనలు చేశారు. సుమారు 40 నిమిషాలు సీఎం కేసీఆర్‌... తెరాస భవన పనులు జరుగుతున్న ప్రదేశంలో అన్ని అంశాలు పరిశీలించి పనులు ముమ్మరం చేయాలని నిర్ధేశించినట్లు సమాచారం.

అంతకుముందు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ వారంతం వరకు కేసీఆర్‌ దిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. పలు పార్టీలతో జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని సమాచారం. దిల్లీ సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకోసం జోద్‌పూర్‌ వంశీయుల బంగ్లాను కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 12, 2022, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.