రెవెన్యూ రికార్డుల నిర్వహణ కోసం ధరణి పోర్టల్ రూపకల్పన గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలోనే మొదటి సారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలన్నది సీఎం ఆకాంక్ష.
కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో అందుకు అనుగుణంగా కొంతకాలంగా అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.