సీఎం కేసీఆర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు కేసీఆర్ చేసిన పలు విలువైన సూచనలను ప్రధానికి వివరించగా... సానుకూలంగా స్పందించిన మోదీ సీఎంకు ఫోన్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన సలహాలను మంత్రి తనకు వివరించారని ప్రధాని తెలిపారు. సీఎం సూచనలు చాలా బాగున్నాయని మోదీ పేర్కొన్నారు. తప్పకుండా ఆచరణలో పెడుతామని మోదీ వివరించారు.
రాష్ట్రానికి మరింతగా ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి విజ్జప్తి చేశారు. ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారు. సత్వరమే చర్యలు చేపడతామని కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రితో మాట్లాడిన కేసీఆర్
అంతకుముందు... కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. కరోనాను నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర మంత్రికి.... సీఎం కొన్ని విలువైన సూచనలు చేశారు.
సీఎం విలువైన సూచనలు...
కరోనావ్యాప్తిని పెంచే అవకాశం ఉన్న సూపర్ స్పెడర్స్‌ను గుర్తించి... వారికి ముందువరసలో టీకాలు వేస్తే బాగుంటుందని సూచించారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ సరఫరా చేసేవారు, స్ట్రీట్ వెండర్స్, కార్మికులు... కరోనా వ్యాప్తిని అధికం చేసే అవకాశాలున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. వారిని ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి... టీకా ఇవ్వాలని కోరారు. ఇందుకోసం నిబంధనలను సడలించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకే వెసులుబాటు కల్పిస్తే ఇంకా మంచిందని కేసీఆర్ సూచించారు. సీఎం సూచనల మీద సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి హర్షవర్ధన్.. ప్రధానితో చర్చించారు.