ETV Bharat / city

CM KCR: దళితబంధు ఓ పథకం కాదు.. ఉద్యమం: కేసీఆర్​

రాబోయే రోజుల్లో దళిత బంధు పథకం దేశానికి దారి చూపుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆకాంక్షించారు. కేవలం ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే పరిమితం కాకుండా... ఎస్సీలను వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తేనుందని ప్రకటించారు. దళితబంధు ద్వారా తెరాస ప్రభుత్వం నూతన ప్రమాణాలను నెలకొల్పుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పుకొచ్చారు.

cm kcr speech on Dalitha bandhu in independence day celebrations at Golkonda

author img

By

Published : Aug 15, 2021, 12:53 PM IST

రాష్ట్రంలో ప్రతి వర్గానికీ న్యాయం చేయాలనే విశాల దృక్పథంతో, ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. గోల్కొండలో నిర్వహించిన 75వ సాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్​.. దళితబంధు ప్రాముఖ్యతను, అవసరాన్ని వివరించారు. అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి అని.. అదే నిజమైన దైవసేవ అని కేసీఆర్​ అభిప్రాయపడ్డారు. కులం పేరిట నిర్మించిన ఇనుపగోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టి ఎస్సీలకు అండగా నిలవాలని పిలువునిచ్చారు. అణగారిన ఎస్సీ వర్గం... ఒక్క ఉదుటున లేచి నిలబడి, స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే దళితబంధు ఉద్యమం అని పేర్కొన్నారు.

ఎస్సీలను ఆర్థికంగా బలోపేతంచేసి, తద్వారా సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించడమే లక్ష్యంగా పెట్టుకొని దళితబంధు పథకానికి తానే స్వయంగా రూపకల్పన చేసినట్టు సీఎం తెలిపారు. మహాత్మా జ్యోతీరావు పూలే, అంబేడ్కర్ ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు.. ఎస్సీల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ ఏడాది బడ్జెట్​లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు.

వ్యాపారాల్లో ప్రత్యేక రిజర్వేషన్​..

"రేపటి నుంచి దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద సంపూర్ణంగా అమలుచేస్తుంది. మిగతా నియోజక వర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తుంది. బ్యాంకులతో సంబందం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా 10 లక్షల రూపాయలను పూర్తిగా గ్రాంటు రూపంలో లబ్దిదారులను అందజేస్తుంది. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సొమ్ముతో ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకొనే పూర్తి స్వేచ్ఛ లభ్దిదారునికే ఉంటుంది. లబ్దిదారులెవరైనా ఉపాధిని ఎంచుకోవటంలో అస్పష్టతకు లోనైతే.. ప్రభుత్వాన్ని సూచనలు కోరినట్టయితే వారికి తగిన విధంగా మార్గదర్శనం చేస్తుంది. కేవలం ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే పరిమితం కావటం లేదు. దళితులను వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తేనుంది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్ షాపులు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు, హస్టళ్లు, సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు, వైన్, బార్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చే దగ్గర ప్రత్యేక రిజర్వేషన్​ అమల్లోకి తేనుంది."- కేసీఆర్​, ముఖ్యమంత్రి

దేశానికే దారి చూపే పథకం..

రాబోయే రోజుల్లో దళిత బంధు పథకం దేశానికి దారి చూపుతుందని.. తద్వారా దేశంలో ఎస్సీల జీవనగతిని మార్చే ఉజ్వలమైన పథకంగా చరిత్రకెక్కుతుందని సీఎం ఆకాంక్షించారు. ఇంతకాలం వివక్షకు గురైన ఎస్సీలు ఇక ముందు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలనే దళిత బంధు లక్ష్యాన్ని ప్రభుత్వం వందశాతం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. దళిత బంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా.. ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం నిశ్చయించుకుందని స్పష్టం చేశారు.

రక్షణ కవచంగా దళితరక్షణ నిధి..

"రక్షణ కవచంగా దళితరక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే ఆకుటుంబం పరిస్థితి మళ్లీ తలకిందులైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆపద సమయంలో దళితబంధు పథకం ఆ దళిత కుటుంబాన్ని ఒక రక్షక కవచంగా కాపాడాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకోసం దేశంలోనే ప్రప్రథమంగా “దళిత రక్షణ నిధి”ని ఏర్పాటు చేసింది. ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10 వేల రూపాయలు లబ్దిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో 10 వేల రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నిధి నుండి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది."- కేసీఆర్​, ముఖ్యమంత్రి

ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను చూసి, ఎంతో మంది దళిత మేధావులు, దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని సీఎం తెలిపారు. రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ విలువల సాధనలో తెలంగాణా దళితబంధు ద్వారా తెరాస ప్రభుత్వం నూతన ప్రమాణాలను నెలకొల్పుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి:

CM KCR Speech: అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.