ఆర్టీసీ సమ్మె చేస్తున్న వారితో ఇక ప్రభుత్వ చర్చలేమీ ఉండవని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోవద్దన్నారు. ఇవాళ ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రి అజయ్‌కుమార్, రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. బస్సులను పూర్తిస్థాయిలో నడపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. అద్దె బస్సులకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడవద్దనే పాఠశాలకు సెలవులు పొడిగించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇదీ చూడండి: 'ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు'