CM Kcr Review Today: ధాన్యం కొనుగోళ్లపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ మంత్రులతో చర్చల సారాంశాన్ని సీఎంకు నిరంజన్‌రెడ్డి వివరించారు.
ఈనెల 26న యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని దిల్లీలో కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్, సురేష్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ (Ts ministers meet piyush goyal) భేటీ అయ్యారు. గోయల్‌తో గంటపాటు సమాలోచనలు జరిపారు.
భేటీ అనంతరం గోయల్ నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వడ్లు కొనుగోళ్లపై కేంద్రంతో సమావేశం అసంపూర్తిగా ముగిసిందని తెలిపారు. చాలా ఆశతో భేటీకి వస్తే కేంద్రం నిరాశ మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాలేదన్నారు. గత వారం మాదిరిగానే ఇప్పుడూ ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పిందని నిరంజన్‌రెడ్డి చెప్పారు.
ఇవీచూడండి: Niranjan reddy on paddy Procurement: 'వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని చెప్పింది'