పురపాలక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పురపోరుకు పచ్చజెండా ఊపుతూ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, అరవింద్ కుమార్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మతో సమావేశమైన ముఖ్యమంత్రి... ఎన్నికల నిర్వహణపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే అపుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంసిద్ధతను ఎన్నికల సంఘానికి తెలుపుతామని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: కేసీఆర్ - cm kcr news
20:07 October 23
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: కేసీఆర్