ETV Bharat / city

CM KCR: కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా? - సీఎం కేసీఆర్

ఈడీ దాడులకు దొంగలు భయపడతారు.. తామెందుకు భయపడతామని సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా? అని బండి సంజయ్​ను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనే వరకూ వదిలేదే లేదని స్పష్టం చేశారు. వడ్లు కొనాలని ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని చెప్పారు.

CM KCR
CM KCR
author img

By

Published : Nov 8, 2021, 6:11 PM IST

రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనే వరకూ వదిలేదే లేదని సీఎం కేసీఆర్ పునరుధ్ఘాటించారు. రాష్ట్రంలో పండే ధాన్యం కొనకుంటే... మీ విధానం ఏంటో చెప్పండని ప్రశ్నించారు. వడ్లు కొనాలని ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని చెప్పారు. తాము పిలుపు ఇచ్చిన ధర్నాలో బండి సంజయ్‌ పాల్గొంటారా? అని ప్రశ్నించారు. యాసంగిలో వరి వేయొద్దని రైతులకు మరోసారి సూచించారు. సీడ్‌ కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి పండించుకోవచ్చని చెప్పారు. తెలంగాణ పత్తికి ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ ఉందని వెల్లడించారు.

నాది ఫామ్‌హౌస్‌ కాదు!

'ఈడీ దాడులకు దొంగలు భయపడతారు.. మేమెందుకు భయపడతాం. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా? నాది ఫామ్‌హౌస్‌ కాదు. ఫార్మర్‌ హౌస్. మాకేం మనీ ల్యాండరింగులు.. బోండరింగులు లేవు. మాకెలాంటి వ్యాపారాలు.. దందాలు లేవు.. మమ్మల్నేం చేయలేరు. అనవసర ప్రయత్నాలు చేస్తే బూమరాంగ్‌ అవుతుంది జాగ్రత్త. నేను సూట్‌కేసులు ఇచ్చానా?.. సూట్‌కేసులు ఇచ్చింది మీరే. దేశంలో ఎన్నికల్లో అధికంగా డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ భాజపానే.'

-కేసీఆర్, సీఎం

మంత్రివర్గంలో అందరూ ఉద్యమకారులే ఉంటారా?

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమది ఫక్తు రాజకీయ పార్టీ అని స్పష్టంగా చెప్పినట్లు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రాజకీయ చాణక్యం.. చాకచక్యం చూపిస్తామని కుండబద్దలు కొట్టి మరీ చెప్పినట్లు తెలిపారు. ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇతర పార్టీ నాయకులను మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. జ్యోతిరాదిత్య సింధియాను భాజపాలోకి తీసుకుని మంత్రి పదవి ఎలా ఇచ్చారని నిలదీశారు. భాజపా చేస్తే సంసారం.. ఇతర పార్టీలు చేస్తే వ్యభిచారమా? అంటూ విమర్శించారు. మంత్రివర్గంలో అందరూ ఉద్యమకారులే ఉంటారా? అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. 20 ఏళ్లు పదవిలో ఉంటానన్న చంద్రబాబును పిడికెడు మందితో ఢీకొన్నానని పేర్కొన్నారు. తాను ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను సృష్టించానని కేసీఆర్‌ వెల్లడించారు.

దేశ ద్రోహులు ఎవరో తేలుద్దాం రా...

దేశాన్ని కాపాడమని చెప్పాం.. అది తప్పా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మన భూభాగం కాపాడుకోవాలని చెప్పడం దేశ ద్రోహమా? అన్నారు. దేశాన్ని కాపాడమన్నోడు దేశద్రోహా.. దేశాన్ని వదిలేసినోడు దేశద్రోహా? అన్నారు. దేశ ద్రోహులు ఎవరో తేలుద్దాం ముందుకు రావాలని చెప్పారు. ట్రైబ్యునల్ వచ్చే వరకు తాత్కాలిక పద్ధతిలో నీటి కేటాయింపులకు అంగీకరించినట్లు వెల్లడించారు. హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు సమావేశానికి వెళ్లాలని తానే చెప్పినట్లుగా వివరించారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు భాజపా నాయకులు ఎక్కడ పడుకున్నారని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రానికి శాశ్వత ద్రోహం చేసినప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు.

పెట్రోల్​పై సెస్‌ మొత్తం ఉపసంహరించుకోవాలి

'కరోనా వేళ ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని ఆదుకున్నది తెలంగాణ మాత్రమే. స్వాతంత్ర్య పోరాటం తర్వాత అతిపెద్ద విషాదం కరోనా వలస కూలీల మరణాలు. మా సర్కారు వలస కూలీలను ఆదుకుంది.. రైళ్లు పెట్టి సొంత ప్రాంతాలకు పంపింది. ప్రజలపై ప్రేమ ఉంటే.. పెట్రోల్​పై సెస్‌ మొత్తం ఉపసంహరించుకోవాలి. కేంద్రం సెస్‌ ఉపసంహరించుకుంటే లీటర్‌ పెట్రోల్‌ రూ.70కే వస్తుంది.. మీరు సిద్ధమా? కేంద్రం విధించిన సెస్‌ తగ్గించకుండా రాష్ట్రాలపై పడి ఏడవటమేంటి? దేశంలో విలేకరులకు రూ.100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా? న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా? ఎక్కడో ఒక ఎన్నిక ఓడిపోగానే మేం కంగారు పడిపోం.'

-కేసీఆర్​, సీఎం

ఇదీ చదవండి :

నాకు సమాధానం కావాలి... అప్పటివరకు భాజపాను వదిలిపెట్టాను: కేసీఆర్

' గొర్రెల పైసల్లో కేంద్రానిది రూపాయి ఉన్నా.. రాజీనామా చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.