హైదరాబాద్నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు నివాళులర్పించారు. పీవీ శత జయంత్యుత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం, కేశవరావు, మంత్రులు కేటీఆర్, తలసాని, ఈటల, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం, ఇతర పార్టీల నేతలు, పీవీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఏడాది పొడవునా పీవీ జయంత్యుత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి : పీవీకి సరైన గౌరవం దక్కలేదా? వంగర వాసులు ఏమంటున్నారు?