ETV Bharat / city

నూతన సచివాలయ నమూనాపై నేడు మరోదఫా సీఎం సమీక్ష

చూడగానే చూపరులను అబ్బురపరిచాలి. ప్రాంగణమంతా పచ్చదనం పరవాలి. మొత్తంగా సచివాలయం సమున్నతంగా ఉండేలా నమూనాను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పలు సూచనలపై ఆర్కిటెక్ట్ బృందం మేధోమథనం చేస్తోంది. మంత్రుల కార్యాలయాలు ఏ దిక్కున ఉండాలి. ఎంతెంత విస్తీర్ణంలో ఉండాలి. తదితర అంశాలపై సీఎం పలు సూచనలు చేశారు.

నూతన సచివాలయ నమూనాపై నేడు మరోదఫా సీఎం సమీక్ష
నూతన సచివాలయ నమూనాపై నేడు మరోదఫా సీఎం సమీక్ష
author img

By

Published : Jul 31, 2020, 5:35 AM IST

నూతన సచివాలయ భవనాన్ని సకల హంగులు, అన్ని సౌకర్యాలు, పచ్చదనం వెల్లివిరిసేలా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగినట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచనలు చేస్తున్నారు. భవన సముదాయంపై బుధవారం సుదీర్ఘంగా సమీక్షించిన సీఎం.. నేడు మరో దఫా సమీక్షించాలని నిర్ణయించారు. ఇవాళ మార్పులు చేర్పుల క్రతువు సింహభాగం పూర్తవుతుందని అంచనా. సచివాలయం ఎదుట ప్రతిపాదించిన పచ్చదనం, ఫౌంటేన్లపై మరింత కసరత్తు చేయాలని నిర్ణయించారు. సోమవారం నాటికి జీ, ఎల్​ బ్లాకుల కూల్చివేత పూర్తయితే... మరో పది నుంచి పదిహేను రోజుల్లో ఆ ప్రాంగణాన్ని నిర్మాణ పనులకు అనుకూలంగా సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

వాస్తు పరంగా..

అధునాతన సమావేశ మందిరం సచివాలయ ప్రాంగణానికి నైరుతి దిక్కులో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. వాస్తు పరంగా నైరుతి అనేది స్థిరత్వం, అదృష్టం, అభ్యున్నతికి సూచికలని నమ్ముతుండటంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అనువుగా అధునాతన సమావేశ మందిరాన్ని నిర్మించనున్నారు. సమావేశ మందిరంలోకి రాకపోకలకు వీలుగా అత్యవసర మార్గాలతో పాటు ముఖ్యమంత్రి కోసం ఒకటి. మంత్రులు, అధికారులకు మరో మార్గాన్ని ప్రతిపాదించారు.

అందుబాటులోకి వచ్చిన తరువాత..

నూతన సచివాలయం అందుబాటులోకి వచ్చిన తరువాత విభాగాధిపతులకంతా ఒకే ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీఆర్కే భవన్‌లో ప్రస్తుతమున్న సచివాలయ కార్యాలయాలు నూతన ప్రాంగణంలోకి వెళ్లిన తరువాత విభాగాధిపతులను అక్కడికి మార్చాలని ఒక ప్రతిపాదనగా ఉంది. ఎమ్మెల్యేల నివాస భవన సముదాయంలో నూతన భవనాలను నిర్మించాలన్నది మరో ప్రతిపాదన ఉంది..

సాధ్యమైనంత త్వరగా..

సచివాలయ ప్రాంగణంలో ఆరు లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణాలు ఉంటాయన్నది ప్రాథమిక అంచనా. నిర్మాణ నమూనాల వ్యవహారం కొలిక్కివచ్చిన తరువాత టెండర్లు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరితగతిన పనులు చేపట్టాలన్నది ప్రభుత్వ వ్యూహంగా ఉంది.

ఇవీ చూడండి: పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.