ముఖ్యమంత్రి కేసీఆర్కు వైద్యచికిత్స కొనసాగుతోంది. స్వల్పంగా లక్షణాలు ఉండడంతో సోమవారం యాంటీజెన్ పరీక్ష చేయగా కొవిడ్ నిర్ధరణ అయింది. అటు ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.
ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి ఐసోలేషన్లో ఉన్నారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖుల ఆకాంక్ష