ETV Bharat / city

'రెవెన్యూ సంస్కరణలతో సుధీర్ఘ సమస్యలకు పరిష్కారం' - రెవెన్యూ చట్టంపై కేటీఆర్​

రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా రెవెన్యూలో భారీ సంస్కరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారని మంత్రి కేటీఆర్​ అన్నారు. దశాబ్దాల బూజుపట్టిన చట్టాలను తిరగరాసి పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ అవినీతిరహిత వ్యవస్థ కోసం నడుంకట్టి జనరంజక పాలనతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్తు తరాల కోసం చట్టాలను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.

ktr
ktr
author img

By

Published : Sep 9, 2020, 9:25 PM IST

తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నూతన శకం ప్రారంభమవుతోందని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ... అవినీతిరహిత వ్యవస్థే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి... రాష్ట్రంలోని అన్ని వర్గాలను, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రెవెన్యూ చట్టానికి రూపకల్పనచేసిందని ట్వీట్ చేశారు.

  • మొన్న పంచాయితీ రాజ్ చట్టం
    నిన్న మునిసిపల్ చట్టం
    నేడు రెవెన్యూ చట్టం
    ఐదేండ్ల కోసం వచ్చే రాజకీయాలను పక్కన నెట్టి
    భవిష్యత్ తరాల అవసరాల కోసం
    అలుపెరుగని అభివృద్ధి ప్రస్తానం
    జయహో తెలంగాణ.. జయ జయహో కేసీఆర్ 🙏#TelanganaRevenueAct

    — KTR (@KTRTRS) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా రెవెన్యూలో భారీ సంస్కరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారని మంత్రి అన్నారు. ఐదేళ్ల కోసం వచ్చే ఎన్నికల రాజకీయాలను పక్కనపెట్టి భవిష్యత్తు తరాల కోసం నూతన చట్టాలను సీఎం కేసీఆర్​ రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల బూజుపట్టిన చట్టాలను తిరగరాసి పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ అవినీతిరహిత వ్యవస్థ కోసం నడుంకట్టి జనరంజక పాలనతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. సామాన్యుడి మెడకు పాశంగా మారుతున్న ఒక్కో చిక్కుముడిని ప్రభుత్వం విప్పుతోందని స్పష్టం చేశారు.

భూ సంస్కరణలు తెచ్చిన పీవీ శతజయంతి సంవత్సరమిది. తెలంగాణ నేల కోసం, జాతి జనుల కోసం నిరంతరం పరితపించిన భూమి పుత్రుడు ప్రజా కవి కాళోజీ జయంతి నేడు. అలాంటి శుభతరుణాన రైతుకు దన్నుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం విశేషం.

- కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

ఇదీ చదవండి: శాసనసభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.