ETV Bharat / city

కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించండి : సీఎం - telangana corona news

కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా ప్రభావం ఉన్నా జీవనం సాగే విషయంపై వ్యూహం అవసరమని తెలిపారు. క్వారంటైన్ నిబంధనలు పాటించాలని సూచించారు. అన్ని రకాల పరికరాలు, మందులు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్ అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు.

cm kcr
cm kcr
author img

By

Published : May 11, 2020, 9:38 PM IST

ఓ వైపు కొవిడ్​ 19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ప్రగతి భవన్​లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే విషయంలో కచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరమని అన్నారు.

దాంట్లో ఎలాంటి సందేహం లేదు

వైరస్ వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని... ఇప్పటి తరహాలోనే అత్యుత్తమ సేవలు అందాలని సీఎం స్పష్టం చేశారు. కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్షలు జరగాలని, ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా కచ్చితమైన క్వారంటైన్​ నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని రకాల వైద్యపరికరాలు, మందులు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నామని... వైద్య పరంగా అత్యుత్తమంగా స్పందిస్తామని చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు.

అన్నింటికి సిద్ధం కావాలి

కరోనాతో పోరాడుకుంటూనే ఇతరత్రా కూడా సిద్ధం కావాలని... కొన్ని ఆర్థిక కార్యకలాపాలు సాగాలని అన్నారు. భవిష్యత్తులో సడలింపుల అమలు, జోన్ల వారీగా అనుసరించాల్సిన వ్యూహం, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రంగాల వారీగా సడలింపులు, కఠినంగా వ్యవహరించాల్సిన అంశాలు, తదితరాలపై అధికారులు లోతుగా ఆలోచించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఇవాళ 79 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.