కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తాడేమో అని దిల్లీలో గజగజ వణుకుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా దిల్లీకి సందేశం ఇవ్వాలని నగర ప్రజలకు సూచించారు. హైదరాబాద్‌లో అందరం కలిసి ఉండే పరిస్థితులు ఉండాలి... పక్క రాష్ట్రం వాడెవడో వచ్చి చెప్పే మాటలకు మోసపోవద్దన్నారు. నన్ను కూడా పరుషపదాలతో తూలనాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఓపిక, సంయమనం, బాధ్యత ఉందనే మాట్లాడం లేదన్నారు.
హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన తరుణమిదని... రెచ్చిగొట్టే మాటలతో రెచ్చిపోతే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు లోపిస్తాయని, శాంతి లేకపోతే ఆస్తుల విలువలు పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు మేధావులు, విద్యావంతులు ముందుకు రావాలని కోరారు. తెరాసకు ఓటేసి... గతం కంటే ఐదారు సీట్లు ఎక్కువ ఇచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మా బాసులు దిల్లీలో లేరు... తెలంగాణ ప్రజలే మా బాసులు అని అన్నారు.
ఇదీ చూడండి: చైతన్యవంతులు అభివృద్ధికే పట్టం కడతారు: కేసీఆర్