ETV Bharat / city

సంస్కర్తకు సరైన గౌరవం దక్కలేదు: కేసీఆర్​

author img

By

Published : Jun 28, 2020, 6:16 PM IST

పీవీ నరసింహారావు సేవలు, ఆయన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నిత్యసంస్కరణల శీలి అయిన పీవీ... అంధకారంలో ఉన్న దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని ప్రశంసించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు సీఎం తెలిపారు.

cm kcr comments in pv narsimharao century birth anniversary celebrations
సంస్కర్తకు సరైన గౌరవం దక్కలేదు: కేసీఆర్​

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. పీవీ శతజయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన కేసీఆర్... తెలంగాణ బిడ్డ ప్రపంచానికి చేసిన గొప్ప సేవలను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిరంతర సంస్కరణ శీలిగా పీవీని అభివర్ణించిన కేసీఆర్... విదేశాంగ మంత్రిగా ఉండి లుక్ ఈస్ట్ పాలసీ, ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చి 800 ఎకరాల సొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించారని కొనియాడారు. ప్రధాని పదవి పీవీని వరించి వచ్చిందని, సంస్కరణలు తీసుకొచ్చి అంధకారమైన దేశాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేసుకున్నారు. పీవీ హయాంలోనే అద్భుత ఆర్థిక సృజన జరిగిందని, అయితే అంత మహోన్నత వ్యక్తికి సరైన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక వ్యక్తిత్వం..

పీవీ గురించి చెప్పడానికి సాహసం కావాలన్న కేసీఆర్​... 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన పీవీని వర్ణించేందుకు మాటలు చాలవని చెప్పుకొచ్చారు. వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీకైన ఆయన జీవితం... వ్యక్తిత్వ పఠిమను పెంచుకోవాలనుకునే వారికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలడని... అందుకే అన్ని భాషలు, వృద్ధ్యాప్యంలోనూ కంప్యూటర్​ నేర్చుకున్నారని గుర్తు చేశారు. గొప్ప కవి, సాహితీవేత్త, రచయిత, జ్ఞానతృష్ణ ఉన్న ఆయన... ఎంత ఎదిగినా సాహిత్యపిపాసను వదులుకోలేదన్నారు. ఆముద్రితాలను కూడా ప్రచురించే పీవీపై... ప్రత్యేక ప్రచురణలు తీసుకురావాలని ఉత్సవ కమిటీకి సూచించారు.

దేశ విదేశాల్లో ఉత్సవాలు..

పీవీ ఆశయాన్ని కొనసాగిస్తూ... తెలంగాణలో 900 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. గ్లోబల్ ఇండియాను సృష్టించిన వ్యక్తి పీవీ అని... ఆ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. 51 దేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, హైదరాబాద్​తోపాటు దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోనూ హోర్డింగులు పెట్టినట్లు వివరించారు. పీవీ వ్యక్తిత్వం పూర్తిగా వెలుగులోకి రావాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. శతజయంతి ఉత్సవాల ముగింపు సభ లక్ష మందితో నిర్వహించుకోవాలని అనుకుంటున్నానని సీఎం తెలిపారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పీవీ పేరు పెడతామన్న సీఎం... తపాలా బిళ్ళ విడుదల చేయాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కొరతామన్నారు.

గౌరవించుకుంటాం..

దిల్లీ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరలో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి... శాసనసభలో భారీ చిత్రపటం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పార్లమెంట్​లో పీవీ చిత్రపటం శాశ్వతంగా ఉండేందుకు ప్రయత్నిస్తామన్నారు. అసెంబ్లీ, మంత్రివర్గంలో తీర్మానం చేసి, అందరినీ కలుపుకొని... పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ ఆర్థిక సంస్కరణలపై పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని, తెలుగు అకాడమీకి పీవీ పేరు పెడతామని ప్రకటించారు. రామేశ్వరంలోని కలాం స్మారకానికి మించి జ్ఞానభూమిలో స్మారకం రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: పీవీకి అభిమానులెక్కువ.. ఘనంగా నిర్వహించండి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.