మన రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు వాసికి కరోనా పాజిటివ్ వచ్చిందని... చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడని వెల్లడించారు. ఇప్పుడు చికిత్స పొందుతున్న వారిలో కరోనా అనుమానిత లక్షణాలు మాత్రమే ఉన్నాయని వివరించారు. మన దేశంలో కరోనా కారణంగా ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే చనిపోయారని చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
భయపడేంత పెద్ద ఉత్పాతం కాదు ఇది. నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలతోనే కరోనాను ఎదుర్కోవచ్చు. 135 కోట్లు ఉన్న దేశ జనాభాలో ఇప్పటి వరకు 83 మందికి మాత్రమే కరోనా సోకింది. ఇప్పటి 66 మంది భారతీయులు, 16 విదేశీయులు. కరోనాను ఎదుర్కోనేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాం. మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేస్తాం.
-సీఎం కేసీఆర్