ETV Bharat / city

బోయగూడ ఘటనపై నేతల దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రముఖుల పరిహారం

Boyaguda Fire Accident News : సికింద్రాబాద్ బోయగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా.. మోదీ రూ.2 లక్షల పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.

Exgratia to Boyaguda Fire Accident Deceased

author img

By

Published : Mar 23, 2022, 9:57 AM IST

Updated : Mar 23, 2022, 1:55 PM IST

Boyaguda Fire Accident News : సికింద్రాబాద్ బోయగూడ అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహా రాష్ట్ర భాజపా, కాంగ్రెస్ నేతలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారిని తప్పక ఆదుకుంటామని మోదీ, కేసీఆర్, నితీశ్‌లు హామీ ఇచ్చారు.

బోయగూడ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.

బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో బిహార్ కార్మికులు మరణించడం పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ అగ్నిప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్.. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఘటనలో చనిపోయిన బిహార్ కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు.

Venkaiah Naidu Responds on Fire Accident : బోయగూడ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితుల కుటుంబాలకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.

Governor Responds on Boyaguda Accident : ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మృతులను వారి స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Bandi Sanjay Mourns Bihar Workers Death : బోయగూడ అగ్నిప్రమాద ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 11 మంది కార్మికులు చనిపోవడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపమే ప్రమాదాలకు కారణమని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.

Boyaguda Fire Accident Updates : బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ బోయగూడలోని ఓ భవనంలో ఉన్న స్క్రాప్ గోదాములో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పైన ఉన్న టింబర్ డిపోకు వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న 11 మంది కార్మికులు మరణించారు. కొందరు సజీవ దహనం కాగా.. మరికొందరు పొగకు ఊపిరాడక మరణించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి భవనంపై నుంచి దూకి.. మంటల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

ఇప్పటికే ఘటనాస్థలిని మంత్రి తలసానితో పాటు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా ఘటనపై విచారణ పూర్తి చేసి వివరాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు.

Last Updated : Mar 23, 2022, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.